కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Spread the love

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్‌ అమిత్‌షాతో సమావేశమయ్యారు. సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపుపై అమిత్‌ షాతో పవన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.