వరంగల్ (ఇలాకా) నవంబర్ 3: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడా రు. ‘ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తాం. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తాం. వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం. కేంద్రం అనుమతిస్తే మామునూరులో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుం ది’ అని అన్నారు.