వాస్తు పేరుతో మార్పులు సరికాదు: హరీశ్ రావు

Spread the love

హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో మార్పులు చేపట్టడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో సచివాలయం నిర్మించామని చెప్పారు. వాస్తు పిచ్చితో సీఎం రేవంత్ రెడ్డి మార్పు చేస్తున్నారని విమర్శించారు. సచివాలయానికి రేవంత్ పూటకో మార్పు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు కోసం రూ.4 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.