4వసారి దేశ యాత్ర
పర్యటకం అంటే ఇష్టం ఉండని వారు ఎవరూ ఉండరు. ఎక్కడికైనా వెళ్లాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏ రైలో, బస్సో, కారో కానీ బెంగళూరుకు చెందిన ముత్తు కుమార్ సైకిల్‌పైన యాత్ర తనకు ఎనలేని అనందాన్ని ఇస్తుందని అన్నారు. ముత్తుకుమార్ ఇప్పటి వరకు మూడు సార్లు సైక్లింగ్ యాత్రలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగో సారి సైకిల్‌పై బెంగళూరు నుంచి కాశీకి వెళ్తూ నగరంలో గోల్కొండ వద్ద కనిపించారు. బెంగళూరులో ఎలక్ట్రిషియన్ పని చేశానని, సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. ముత్తుకుమార్ సైకిల్ పై మొదటి సారి చెన్నై నుంచి కాశీ, రెండోవ సారి రామేశ్వరం నుంచి కాశీ, మూడోసారి బెంగళూరు నుంచి కాశీకి వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ఈ యాత్ర తనకు నాలు గో సారి అని అన్నారు. తనకు సైకిల్‌పై ప్రయా ణం అయనకు అనందాన్ని ఇస్తోందని చెప్పారు.