హైస్కూల్లో చేతి వ్రాతపై శిక్షణ

Spread the love

దుబ్బాక (ఇలాకా) నవంబర్ 6: దుబ్బాక మున్సిపాలిటీ పరిధి ధర్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ చేతి రాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ విద్యార్థులకు చేతివ్రాతపై శిక్షణ అందజేశారు. ప్రధానోపాధ్యా యులు ఎండి సాదత్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతి వ్రాత శిక్షణ ఏర్పాటు చేశారు. రాయడం ఒక కళ అని, దానిని మనసుపెట్టి నేర్చుకోవాలని ఎజాజ్ అహ్మద్ విద్యార్థులకు సూచించారు. మండల విద్యాధికారి జోగు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.