‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి

Spread the love

హైదరాబాద్, నవంబర్ 15 (ఇలాకా): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న హైదరాబాద్‌లో లోక్‌మంథన్-2024ను ప్రారంభించనున్నారు. ‘నేషన్-ఫస్ట్’ మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తల సంస్థ అయిన‌ ప్రజ్ఞా ప్రవహ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. లోక్ మంథన్ ప్రారంభానికి ముందు ఎగ్జిబిష‌న్‌, సాంస్కృతిక కార్యక్రమాలు నవంబర్ 21 న మొద‌లుకానున్నాయి. నవంబర్ 21 నుండి 24 వరకు జరిగే ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.