శంషాబాద్ టు మదీనా(మక్కా)కు..

Spread the love
కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన ఇండిగో

శంషాబాద్, ఫిబ్రవరి 21 (ఇలాకా):శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మక్కాకు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమాన సర్వీస్‌ను ప్రారంభించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చడం కోసం విమాన సర్వీస్‌లు ఉపయోగపడుతాయని ఎయిర్ లైన్స్ అధికారులు వివరించారు. ప్రతి సోమ, గురు, శనివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రెండు దేశాల మధ్య 5 గంటల 47 నిమిషాలు సమయం పడుతుందని వినయ్ మలహోత్ర తెలిపారు. మక్క మదీనాకు హైదరాబాద్ నుంచి ఇండిగో తొలివిమాన సర్వీస్ను అందించడం గొప్ప విషయమని ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ పేర్కొన్నారు. భారతదేశం నుంచి వారంలో సౌదీ అరేబియాలోని మదినాకు అనుసందానమైన మరో మూడు రియాద్, దమ్మాం, జెడ్డా నగరాలకు సుమారు ౧౦౦ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.