నేరేడుగొమ్ము, ఇలాకా: తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నేరేడుగొమ్ము మండలం అధ్యక్షులుగా నేనావత్ లాలు నాయక్, ప్రధాన కార్యదర్శిగా అజ్మీరా కోటేష్ నాయక్, ఉపాధ్యక్షులు రాత్లావత్ శ్రీను నాయక్, కార్యదర్శిగా కొర్ర చందు నాయక్, మహిళా అధ్యక్షురాలుగా కే. శిరీష ఎన్నికయ్యారు. శుక్రవారం దేవరకొండలోని బంజారా భవన్ లో నిర్వహించిన నేరేడుగొమ్ము మండలం నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కేతావత్ పంతులాల్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. గిరిజన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం పోస్టులను మంజూరుచేసి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భాషా పండిట్, వ్యాయామ టీచర్స్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. కొత్త డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు లక్షకు పైగా పెండింగ్ లో ఉన్న సప్లిమెంటరీ బిల్స్ క్లియర్ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ఆరాధ్యదైవం సేవాలాల్ జయంతిని ప్రభుత్వం పబ్లిక్ హాలిడే గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అజ్మీరా కోటేష్ నాయక్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న పీ.జీ.టీ, టీ.జీ.టీ ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల గత ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందన్నారు. హెల్త్ కార్డులు లేక, సమయానికి వేతనాలు రాక అనేక ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీర్ఘకాలిక సమస్యలైన బదీలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, 010 నుండి ప్రతి నేల వేతనాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మండలం టీజీయూఎస్ ప్రధాన కార్యదర్శి బాణావత్ సైదా నాయక్, సర్దార్ సింగ్ నాయక్, శ్రీను రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.