అజిత్ కు మళ్లీ ప్రమాదం

Spread the love

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ స్పెయిన్ లో కారు రేసింగ్ లో పాల్గొన్నారు. ఈక్రమంలో మరో కారును తప్పించే ఘటనలో హీరో అజిత్ కారు అదుపు తప్పింది. వెంటనే అది పల్టీలు కొట్టుకుంటూ వెల్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది.ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ కు ఎటువంటి గాయాలు తగలలేదు. ప్రమాదం జరగ్గానే అక్కడున్న టీమ్ వెంటనే పరుగున అక్కడికి చేరుకుని హీరోను సెఫ్టీగా బైటకు తీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆయనకు ఎలాంటి దెబ్బలు గాయాలు కాలేదని గుర్తించారు. అయితే.. అజిత్ కుమార్ గతంలో కూడా దుబాయ్ లో రేసింగ్ కు వెళ్లినప్పుడు ఇదే విధంగా కారు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు కూడా.. ఆయన వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బైటపడ్డారు. అజిత్ ఈ మధ్యన కార్ రేసింగుల్లోనూ పాల్గొంటున్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగుల్లో పాల్గొంటారు. కార్ రేసింగ్ ల్లో పాల్గొనడం అజిత్ కు హాబీ.