బంగ్లా వైమానిక స్థావరంపై దాడి.. ఒకరి మృతి

Spread the love
కాక్స్ బజార్ జిల్లాలో ఘటన


ఢాకా, ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు స్థానిక వ్యాపారి షిహాన్ కబీర్ (30)గా గుర్తించారు. అయితే వైమానిక స్థావరంపై దాడిలో షిహాన్ కబీర్ మృతి చెందడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా వైమానిక దళ సిబ్బందికి, స్థానికులకు మధ్య ఘర్షణ తలెత్తింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ హింసాత్మకంగా మారింది. స్థానికులు వైమానిక దళ స్టేషన్‌లోకి చొరబడేందుకు యత్నించడం వీడియోల్లో రికార్డయ్యాయి. అనుమతి లేకుండా చొరబడడంతోనే ఎదురుదాడికి దిగినట్లు భద్రతా సిబ్బంది తెలిపింది. అంతకముందు బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్).. ‘కాక్స్ బజార్ వైమానిక స్థావరంపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై వైమానిక దళం అవసరమైన చర్యలు తీసుకోనుంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.