లక్నోతో హైదరాబాద్ ‘ఢీ’

Spread the love
  • ఫెవరెట్‌గా కమిన్స్ సేన
  • రెండో విజయంపై కన్ను
  • తొలి విజయం కోసం లక్నో ఆరాటం

హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరుకు సిద్ధమైంది. రాత్రి 7.30 గంటలకు మొదలుకానున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్ ఈసారి 300 పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లతో ఓపెనింగ్ జోడీ పటిష్టంగా కనిపిస్తుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మలతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ పేస్ భారం మోయనుండగా.. ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలుపు అంచుల దాకా వచ్చి చేజేతులా ఓడిన లక్నో తొలి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మార్కరమ్, మార్ష్, పూరన్‌లతో టాపార్డర్ బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ పంత్ ప్రభావం చూపించాల్సిన అవసరముంది. మిడిలార్డర్‌లో మిల్లర్ మినహా మిగతావారు విఫలమవ్వడం కాస్త ఇబ్బందికర విషయం. అయితే బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, సిద్దార్థ్, రవి బిష్ణోయిలతో లైనప్ పటిష్టంగా ఉంది.

తుది జట్ల అంచనా:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్, అభినవ్, కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జంపా, షమీ, సిమర్జీత్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: మార్కరమ్, మిచెల్ మార్ష్, పూన్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), బదోని, మిల్లర్, శార్దూల్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయి, దిగ్వేశ్ రతి, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్