ఢిల్లీ క్యాపిటల్స్ ‘సూపర్’ విజయం

Spread the love
  • టైగా ముగిసిన రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్-
  • సూపర్ ఓవర్ ద్వారా ఫలితం
  • మెరిసిన స్టార్క్.. జైస్వాల్, నితీశ్ రానా అర్థశతకాలు వృథా
  • నేడు హైదరాబాద్‌తో ముంబై ‘ఢీ’

ఢిల్లీ, ఏప్రిల్ 16: ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ ద్వారా విజయాన్ని అందుకుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్‌లో గెలుపును అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పొరెల్ (49), కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (34), స్టబ్స్ (34*) తలా కొన్ని పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీయగా.. తీక్షణ, హసరంగ చెరొక వికెట్ పడగొట్టారు. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కూడా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. జైస్వాల్ (51), నితీశ్ రానా (51) అర్థసెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, అక్షర్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. సూపర్ ఓవర్‌లో తొలుత రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ 13 పరుగులు చేసి గెలుపొందింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

తలా కొన్ని పరుగులు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మెక్‌గుర్క్ (9), కరుణ్ నాయర్ డకౌట్‌గా పెవిలియన్‌చేరడంతో 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ అభిషేక్ పొరేల్‌కు జత కలిసిన కేఎల్ రాహుల్ (38) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పొరేల్ , రాహుల్ ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్టబ్స్ (34 నాటౌట్), అక్షర్ పటేల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పరిగెత్తించాడు. ఈ ఇద్దరు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడంతో ఢిల్లీ 180 పరుగుల మార్క్‌ను దాటింది.

రాణించిన జైస్వాల్, నితీశ్ రానా

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ శుభారంభం అందించారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం శాంసన్ (31) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో నితీశ్ రానా (51) జైస్వాల్‌తో కలిసి రాజస్థాన్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ధ్రువ్ జురేల్ (26)ను రనౌట్ చేయడంతో పాటు 8 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్ ఓవర్ సాగిందిలా..

సూపర్ ఓవర్‌లో భాగంగా తొలుత రాజస్థాన్ ఆరు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. స్టార్క్ బౌలింగ్ చేయగా.. పరాగ్ (4) రనౌట్ అయ్యాడు. హెట్‌మైర్ ఒక ఫోర్ బాదాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరింది. ఐపీఎల్లో ఒక మ్యాచ్ టై అవ్వడం ఇది 15వ సారి కాగా.. 2022 తర్వాత మళ్లీ సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం