లగ్జరీ కారు కొనాలనుకుని ఎదురుచుస్తున్న వారికి మెర్సిడెస్ బెంజ్ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఈ కూపే (Mercedes-Benz CLE Coupe) కారును మంగళవారం విడుదల చేసింది. ఈ కారు ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు సిద్దమౌవుతుంది.. మెర్సిడెస్ సీ-క్లాస్ కూపే మరియు మెర్సిడెస్ ఈ-క్లాస్ కూపే కొత్త మో
డళ్లలలో ప్రత్యేక ఆకర్షనీయమైన స్పోర్టీ లుక్ లో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కార్లు రాబోతున్నాయి…
దృష్టిని ఆకర్షించే మెర్సిడెస్ సీఎల్ఈ డిజైన్
మెర్సిడెస్ సీఎల్ఈ కూపే ముందు భాగంలో అందమైన ఎల్ఈడీ హెడ్ల్ ల్యాంప్స్ తో ప్రత్యేకంగ కనిపించే సిగ్నేచర్ డైమండ్ గ్రిల్.
ఈ కారులో ఫ్రేమ్ లెస్ డోర్స్ మరియు స్లోపిగ్ రూఫ్ లు మరో ప్రత్యేకతగా నిలిచాయి. కారుకు వెనుక భాగంలో అందంగా చెక్కనట్టుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ప్రీమియం లూక్ లో కనిపించే బంపర్ కూడా ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.
మెర్సిడెస్ సీఎల్ఈ కూపే కారుకు 19 ఇంచులా అలాయ్ విల్స్, విభిన్న రంగులలో ఈ కారు అందుబాటులోకి సంస్థ తేనుంది.
ఇంటీరియర్
మెర్సిడెస్ సీఎల్ఈ కూపే కారులో అడుగుపెడితే ఒక ప్రత్యేక అనుభవం కలుగుతుంది. ఇందులో 12.3 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే.. 11.9 ఇంచుల టచ్ స్క్రీన్.. వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, అండ్రాయిడ్ సిస్టమ్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ మరియు కారులో అంబియంట్ లైటింగ్ 64 రంగులలో ఉంటుంది. వుడ్ ఫినిష్ ప్యానెల్స్, మరియు ప్రీమియం లెదర్ సీట్స్ ఈ కారు ప్రత్యేకతలు.
ఇంజిన్
మెర్సిడెస్ సీఎల్ఈ కూపేలో 2.0L నాలుగు సిలిండర్ టర్బో ఇంజన్ తో పాటు అత్యంత వేగంగా స్పందిచగలదు..
3.0L ఆరు సిలిండర్ల్ టర్భో ఇంజన్ ఉన్న కారు ఎక్కువ పవర్ ను కలిగిఉండి స్టోర్టీ డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది..
ఈ కారులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, 9జీ ట్రానిక్ టెక్నాలజీతో ఆటోమేటిక్ ట్రాన్సీమిషన్ (ఆటో గేర్ షిఫ్ట్) కూడా ఉన్నది..
పలు మోడల్లలో ఆల్ వీల్ డ్రైవ్ కూడా అందుబాటులో ఉంది.
భద్రతా
మెర్సిడెస్ సీఎల్ఈ కూపేలో అత్యాధునిక భద్రతా సాంకేతికతలు
యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ అనేది ఒక భద్రతా వ్యవస్థ, ఇది డ్రైవర్ బ్రేక్ పెడల్‌పై తగినంత ఒత్తిడి పెట్టకపోయిన అత్యవసర సమయంలో మిల్లి సెకన్లలలో స్వయంచాలకంగా బ్రేక్‌లను వేగంగా వర్తింపజేస్తుంది. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలను నివారించడానికి లేదా తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది.
లేన్ కీప్ అసిస్ట్
లేన్ కీప్ అసిస్ట్ అనేది డ్రైవర్ ఒకవెల కారు నియంత్రన కోల్పోయి కారు రోడ్డుపైనుంచి పక్కుకు వెళ్తుంటే ఈ వ్యవస్థ ఆక్టివేట్ అయ్యి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కారు స్టీరింగ్ ను స్వతహాగా రోడ్ పై నుంచి కిదకి వెళ్లకుండా, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది.
బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
ఈ కారులో ఉండే ప్రత్యేక సెన్సార్ల ద్వారా లైన్ మారేటప్పుడు కాని పార్కింగ్ సమయంలో బ్లైండ్ స్పాట్ లోకేషన్స్ ను గుర్తించి డ్రైవర్ కు హెచ్చరిలకు జారీ చేస్తుంది. 360° కెమెరా ఎంపిక చేసిన మోడల్ కార్లలలో మాత్రమే లభిస్తున్నాయి.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అనేది ప్రతేక సెన్సార్ల ద్వారా పని చేస్తున్నది. ఈ వ్యవస్థ వల్ల కారు దానంతట అదే వేగంను నియంత్రిచగలదు.. హైవేలపై ప్రయాణం చేస్తున్నప్పుడు ముందున్న కారు వేగాన్ని బట్టి మీ కారు వేగాన్ని నియంత్రిస్తుంది. ముందున్న కారు వేగం పెంచినట్లయితే మీ కారు వేగాన్ని కూడా పెంచడానికి సహకరిస్తుంది. తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి..
మెర్సిడెస్ సీఎల్ఈ కూపే కారు ఎందుకు కొనాలి?
అత్యాధునిక టెక్నాలజీ
లగ్జరీ మరియు స్పోర్ట్ ఫీల్ కలయిక
ప్రీమియమ్ డిజైన్ మరియు సౌకర్యం
మెర్సిడెస్ సేఫ్టీ ప్రమాణాలు
సంక్షేపం
మెర్సిడెస్-బెంజ్ CLE కూపే లగ్జరీ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేసింది. స్టైల్, పనితీరు, మరియు సౌకర్యం ఒకే వాహనంలో కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.