అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వి పుతిన్ భారత కాలమానం ప్రకారం శనివారం అమెరికా 1867లో రష్యా నుంచి సుమారు 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన అలాస్కాలోని యాంకరేజ్ సిటీలో సమావేశం జరుగుతున్నది.
ఈ సందర్భంగా తెరపైకి అలాస్కా అమ్మడంపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. అసలు అలాస్కాను రష్యా ఎందుకు అమ్మింది? అందుకు కారణం ఏంటి? ఈ రెండు దేశాల మధ్య ఏలాంటి ఒప్పొందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇదే ప్రదేశంలో రెండు దేశాల అధ్యక్షులు ఎందుకు కలవవలసి వచ్చింది అని ప్రజలలో ప్రశ్నలు లేవనేత్తుతున్నాయి. ఇందులో ఉక్రేయిన్ – రష్యా యుద్ధం గురించి ఏమైనా చెర్చిస్తారా.. ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఏమైన నిర్ణయం తీసుకోనున్నారా.. రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూ భాగం గురించి ఏమైనా చర్చలు జరుగనున్నాయా? ఏలాంటి నిర్ణాయాలు తీసుకోనున్నారు అని ఉక్రెయిన్ ప్రజలు ఎదురుచూస్తుంది.
అలాస్కాను ఎందుకు అమ్మవలసి వచ్చింది?
1783లో ప్రస్తుత ఉక్రేయిన్ లోని క్రిమియా ద్వీపకల్పం కోసం రష్యా కేథరీన్ ది గ్రేట్ ఆధ్వర్యంలో జరిగిన యుద్ధం కారణంగా రష్యా అలాస్కాను అమెరికాకు అమ్మవలసి వచ్చింది. అ తరువాత క్రిమియా 1991లో ఉక్రెయిన్ లో కలసిపోయింది. రష్యా తిరిగి క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో స్వాధీనం చేసకుంది. ఆ తరువాత ఉక్రెయిన్ పై రష్యా 2022లో పూర్థిస్థాయిలో దాడిలో పాల్గొంది. యుద్ధం ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. కాని ఇప్పుడు ట్రంప్ – పుతిన్ చర్చల్లో ఈ విషయం గురించి ప్రస్థావించిన ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చని చరిత్రకారలు మాట.
అప్పటి అలాస్కా అమ్మకం విషయంలో రష్యాకు చెందిన జాతీయవాదులు ఇది చారిత్రక తప్పుగానే పరిగనిస్తున్నారు. అ సమయంలో రష్యాకు మంచి నిర్ణయమైనా ప్రస్థుతానికి రష్యాకు చాలా పెద్ద నష్టంగానే కొంత మంది రష్యన్ ప్రజలు పరిగణిస్తున్నారు.

ఈ అమ్మకానికి కారణాలు ఏన్నో..
18వ శతాబ్దంలో వలసవాదుల విస్తరణ పెరిగింది అప్పుడు రష్యా అలాస్కాను ఉక్రెయిన్ నించి స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో రష్యాకు మరో చిక్కువచ్చి పడింది. ప్రస్థుత అలాస్కాకు రష్యా ప్రజలు చేరుకునేందుకు ఉత్తర అమెరికా మరియు ఆసియా మధ్యలో ఇరుకైన ‘‘బెరింగ్ నీటి మార్గం’’ ద్వారా సముద్రం గుండా ప్రాయానించ వలసి వచ్చేది. అప్పుడు రష్యా అక్రమించుకున్న భూభాగం ప్రస్థుత అలాస్కాను స్వాధీనం చేసకొవడానికి డానిష్ కు చెందిన నావికుడు విటస్ బెరింగ్ పేరును 1720లో జార్ పీటర్ ది గ్రేట్ జలసంధికి నావికుడు విటస్ బెరింగ్ పేరును పెట్టారు.
అలాస్కాకు చెందిన అలూటియన్ దీవులు అత్యంత సంపన్నమైన మరియు అత్యంత ప్రజలు నివసించేందుకు యోగ్యత కలిగిన 69 ద్వీపాలు (14 పెద్ద అగ్నిపర్వతాలు మరియు 55 చిన్నవి) రష్యాకు చెందిన దొపిడిదారులు అక్కడి నావికులు, అన్వేషకులు, ప్రజలను దోచుకుంటూ, అక్కడి నాయకుల పిల్లలను అపహరించడం, పడవలను దోచుకోవండం, నావికుల వేట పరికరాలను, పడవలను నాశనం చేయడం, ప్రజలను ఈంసించడం రోజురోజూకు పేరిగిపోయింది. రష్యాకు అలాస్కానుంచి ప్రయోజనం కూడా తగ్గిపోయింది. అలాస్కాలో అర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా సన్నగిల్లాయి.
దాంతో 1799లో రష్యన్ సామ్రాజ్యం రష్య మరియు అమెరికా కలసి తోళ్ల పరిశ్రమని అధికారికంగా ప్రారంభించాయి. దాంతో రష్యా అలాస్కా భూభాగాన్ని పూర్థిస్థాయిలో స్వాధీనం చేసకుంది. రష్యా అమెరిక కలసి ధక్షిణం వైపు కాలిఫోర్నియా వరకు భూభాగాలను స్వాధీనం చేసుకుంటు వచ్చాయి.
కానీ అక్కడ ఏర్పాటు చేసిన తోళ్ల పరిశ్రమ రోజురోజూకూ నష్టాలను తీసుకురావడం పెద్ద దెబ్బగా మారింది. రష్యా, బ్రిటిష్ మరియు అమెరికా వ్యాపారులు మధ్య కూడా సరైన ఓప్పొందాలు లేకపోవడం, జంతువులను వేట స్థాలాల పరిమితులు నిర్ధారించుకోకపోవడం మరియు దోపిడిదారుల నుంచి రష్యా ప్రజలను, వారి ఆస్తులను రక్షించుకోవడం రష్యాకు పెద్ద సమస్యగా మారింది. ఈ సంఘటణలు కూడా అలాస్కాను అమెరికాకు అమ్మడానికి కారణంగా మారి ఉంటాయని చరిత్రకారులు పెర్కొంటున్నారు.
ప్రదేశం.. రాజకీయ సవాళ్లు
అనేక సవాళ్లను ఏదుర్కోని స్వధీనం చేసకున్న అలాస్కాను రష్యాకు దూరం ఉడటం, అక్కడి రాజకీయ పరిస్థితులను సరిగా అంచన వేయకపోవడం. వాణిజ్య పరంగా అక్కడి పరిస్థితులు లాభదాయకంగా లేకపోవడం కూడా అలాస్కాను అమెరికాకు అమ్మడం ఒక కారణంగా చేప్పుకోవచ్చు..
క్రిమియాలో ఒట్టోమన్, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లతో యుద్ధం జరిగిన సందర్భంలో బ్రిటిష్ దళాలు అమెరికా ద్వారా రష్యాకు చెందిన అలాస్కాతో పాటు రష్యాకు చెందిన పలు ప్రాంతలను 1853లో బ్రిటిష్ ఆక్రమించుకుంటుదనే భావనతో అమ్మకం మరోక కారణమై ఉండవచ్చని నిపునులు విశ్వసించారు.
1850లో అమెరికా టెక్సాస్, కాలిఫోర్నియా, మెక్సికోతో యుద్ధం చేసి వాటిని స్వాధీనం చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఉత్తర అమెరికా అంతటా విస్తరిస్తూ పోయింది. ఆ సమయంలో పసిఫిక్ నౌకాదళ కమాండర్ తో అలాస్కాను విలైనంత వరకూ స్వాధీనం చేసుకోమని కోరింది.
విదేశాంగ కార్యదర్శి విలియం హెన్రీ సెవార్డ్ అమెరికాకు రష్యన్ మంత్రి ఎడ్వర్డ్ స్టోయెక్ల్‌కు 1867లో ఈ భూభాగానికి $5 మిలియన్లకు అమ్మకానికి చర్చలు జరిగాయి. ఈ చర్చలో వారు రెండు వారాల తర్వాత $7.2 మిలియన్లు లేదా ఎకరానికి రెండు సెంట్ల కంటే తక్కువకు అంగీకరించారు. రాత్రంతా జరిగిన చర్చల తర్వాత ఉదయం 4 గంటలకు సెవార్డ్ కార్యాలయంలో కాంగ్రెస్ మరియు జార్ అలెగ్జాండర్ II అధ్వర్యలో ఆమోదం తెలుపుకొని ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కొంత ఉద్రిక్తతకు మరియు కుంభకోణానికి దారితీసింది: అమెరికా ప్రభుత్వం రష్యాకు చెల్లించడానికి ఆలస్యం చేసింది మరియు అమెరికన్ రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టులు చెల్లింపులో కోతలు లంచాలుగా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది విమర్శకులు ఫ్రాన్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఘనీభవించిన భూభాగాన్ని జోడించడం వల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనాన్ని చూడలేదు మరియు కొనుగోలును “సెవార్డ్ మూర్ఖత్వం” అని చరిత్రకారులు పేర్కొన్నారు.