జాతీయ అంతరిక్ష దినోత్సవం

Spread the love

చంద్రునిపై దిగిన నాల్గవ దేశంగా మరియు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం దగ్గర చంద్రయాన్-3 మిషన్ చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (Indian Space Research Organisation (ISRO)) 2023 ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 మిషన్(Chandrayaan-3 mission) యొక్క విక్రమ్ ల్యాండర్(Vikram lander) విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ప్రజ్ఞాన్ రోవర్(Pragyan rover) చంద్రుడిపై ప్రయానించడానికి గుర్తుగా ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం(National Space Day)గా నిర్వహించుకుంటున్నాం. 

చంద్రునిపై దిగిన నాల్గవ దేశంగా మరియు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం దగ్గర చంద్రయాన్-3 మిషన్ చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీంతో దక్షిణ ధ్రువం దిగిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. మృదువైన ల్యాండింగ్ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా చంద్రునిపై ప్రయాణించింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్(Shiv Shakti Point) అని పేరు పెట్టారు. ఈ విజయాన్ని గౌరవించేందుకు, భారత ప్రభుత్వం ఆగస్టు 23ని అధికారికంగా “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా ప్రకటించింది.

నేషనల్ స్పేస్ మీట్ 2.0

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం న్యూఢిల్లీలో నేషనల్ స్పేస్ మీట్ 2.0(National Space Meet 2.0)ని నిర్వహించింది. ఈ వేడుకలల్లో భాగంగా ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ వరకు భారతదేశ అంతరిక్ష అనువర్తనాల రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ఈ సమావేశం అనేక మంత్రిత్వ శాఖలు, ప్రైవేట్ వాటాదారులు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు మరియు నిపుణులతో నిర్వహించారు.

అంతరిక్ష రంగ సంస్కరణలలో భాగంగా 1963లో తుంబాలో రాకెట్ ప్రయోగాల నుంచి నేటి ప్రపంచవ్యాప్త గుర్తింపుతో భారతదేశం అంతరిక్షంలో సాధించిన అద్భుతమైన అంతరిక్ష ప్రయాణాన్ని హైలైట్ చేశారు. అత్యధుని సామర్థ్యాలతో, పలు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో “విక్షిత్ భారత్ 2047”(Viksit Bharat 2047) కోసం కృషి చేస్తాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ అన్నారు.  ఆగస్టు చివరి వరకూ జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను అంతరిక్ష శాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది, యువతను అంతరిక్ష శాస్త్రం మరియు దాని అనువర్తనాల్లో ప్రేరేపించడానికి మరియు నిమగ్నం చేయడానికి. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) ఈ నెలలో అహ్మదాబాద్, ఉదయ్ పూర్  మరియు మౌంట్ అబూలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనుంది.