‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకించిన టీవీకేతమిళ నటుడు విజయ్ కి చెందిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకించింది. ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలానే, తమిళనాడు నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. తమిళనాడులో కులగణన నిర్వహించకపోవడంపై కేంద్రం, DMK ప్రభుత్వంపై మండిపడింది.