సిద్ధిపేట (ఇలాకా) నవంబర్ 6: సిద్ధిపేట జిల్లా రాఘవాపుర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో ముచ్చటించి, వడ్ల కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం అన్నారు కానీ ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు పండించిన పంటని దళారులకు అమ్మి నష్టపోయారన్నారు. రైతులకు పంట బోనస్ ఇవ్వకుండా, సమయానికి వడ్లను కొనకుండా రైతులను ఆగం చేస్తున్నారని కేటిఆర్ తెలిపారు.