మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 6: నూతనంగా ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో శాసనసభలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక పరిస్థితిపై స్వేద పత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశామన్నారు. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చేనాటికి 7 లక్షల కోట్లు అప్పుతో ఉందన్నారు. బిల్లు అయి ట్రెజరీ శాఖ ఆమోదం పొందిన దాదాపు 40 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లు ఉన్నాయన్నురు. గ్రామపంచాయతీలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచ్ ల ఆందోళన, గురుకుల భవనాలకు అద్దెల చెల్లింపు, పెండింగ్ లో ఉన్న డిఏ చెల్లించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల పెండింగ్ బిల్లులన్నీ విడుదలవారీగా చెల్లిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాల హాస్టల్ లో మెస్ కాస్మోటిక్ చార్జీలు 40% పెంచామని, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని 25 వేల పాఠశాలలకు 1100 కోట్లకు మౌలిక సదుపాయాలు కల్పించామని, వైద్య కళాశాలల ఏర్పటే కాకుండా వైద్య విద్యకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
వైద్యులపై దాడి జరిగితే ఎక్కడ ఉపేక్షించేది లేదని, వారి భద్రతా, రక్షన విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటుందని, వైద్య వృద్ధి సమాజంలో చాలా గొప్పనైనది.. సామాజిక బాధ్యత వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.