హుస్నాబాద్ (ఇలాకా) నవంబర్ 7: హుస్నాబాద్ నియోజకవర్గం భిమదేవరపల్లి మండలంలో గట్ల నర్సింగాపూర్ లో ఇటీవల మరణించిన భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సామల లింగమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం సామల లింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకార్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన ఇంటింటి కుటుంబ సర్వే పై ఎన్యుమరెటర్స్ వేస్తున్న స్టిక్కరింగ్ ను గట్ల నర్సింగపూర్ లో పరిశీలించి కుల గణన పై అధికారులకు సమగ్ర వివరాలు ఇవ్వాలని సమాచారం గోప్యత ఉంటుందని స్థానికులకు తెలియజేయశారు. అనంతరం స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులతో ముచ్చటించి బాగా చదువుకోవాలని సూచించారు. గట్ల నర్సింగపూర్ కూరగాయలు అమ్మతున్న మహిళల తో పలకరించారు. గ్రామంలో పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.