హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఇలాకా): హైదరాబాద్, మాసబ్ ట్యాంక్, శాంతినగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఓ ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకి దిగే సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు కేకలు వేయగా.. అపార్ట్మెంట్ వాసులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సంఘటన చోటికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సాయంతో నాలుగు గంటలు శ్రమించి లిఫ్ట్ డోర్లు తొలగించి బాలుడిని బయటకు తీశారు. అనంతరం అత్యవసర చికిత్స కోసం నిలోఫర్ ఆసుపత్రికి బాలుడిని తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి బాలుడికి చికిత్స అందిస్తూన్నామని నిలోఫర్ వైద్యులు తెలిపారు.