ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న బీజేపీ

Spread the love

హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 7: త్వరలో సంస్థాగత ఎన్నికలు రాబోతున్న సందర్భంగా బీజేపీ పార్టీ సన్నద్ధం అవుతుంది. ఇందుకోసం గురువారం కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో పార్టీ కార్యాకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఎంపీ శ్రీమతి డీకే అరుణ, ఇతర ప్రధాన నాయకులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.