వైభవంగా పెద్దమ్మ బోనాలు

సిద్దిపేట రూరల్ : మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డి పల్లిలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవం గా కొనసాగుతున్నాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం బోనాలు సమర్పించారు. ఢిల్లెం బల్లెం చప్పుల్లు, శివసత్తుల శిగాలు, పోతురాజుల నృత్యాల నడుమ బోనాల ఊరేగింపు కొనసాగింది. జై పెద్దమ్మ తల్లి నామస్మరణ తో పల్లెలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో సంఘం సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.