– ముంబై ఇండియన్స్‌పై విజయం
– పట్టికలో అగ్రస్థానానికి మెగ్ లానింగ్ సేన
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయంతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (22), కెప్టెన్ హర్మన్ (22) పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్, మిన్నూ మానీ చెరో 3 వికెట్లు తీయగా.. శిఖా పాండే, అన్నాబెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 14.3 ఓవర్లలోనే 124 పరుగులు చేసి గెలుపు అందుకుంది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 60 నాటౌట్, 9 ఫోర్లు) ధాటిగా ఆడగా.. షఫాలీ వర్మ (28 బంతుల్లో 43) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అమన్‌జోత్ కౌర్ ఒక వికెట్ పడగొట్టింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.