- ఐఎంఏ జిల్లా డాక్టర్ అధ్యక్షులు నాగమల్ల శ్రీనివాస్
- ఐఎంఏ ఆధ్వర్యంలో జాతీయ వ్యాయామ దినోత్సవం
జాతీయ వ్యాయామ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ రెండవ బైపాస్ రోడ్డు లోని వ్యాయామ సెంటర్లో వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ వ్యాయామం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, గుండె జబ్బులు, షుగర్ తో పాటు ఇతర వ్యాధులు రాకుండా వ్యాయామం కాపాడుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి తన దినచర్యలో భాగంగా వ్యాయామం చేయాలని కోరారు .డాక్టర్ నాగమల్ల పద్మలత మాట్లాడుతూ పిల్లలలో వ్యాయామం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు ఎదుగుదల బాగుంటుందని, చిన్నప్పటినుండి తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాయామం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్, డాక్టర్ ఆనంద్ రెడ్డి, డాక్టర్ సంతోష్, అనిత, దీప్తి, వర్ష, నామాల ప్రదీప్, డాక్టర్ రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు