
గుండ్లపల్లి, (ఇలాకా): కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న బాలికల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని ఎంఈఓ, జీహెచ్ఎం ఇస్లావత్ గోప్యా నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని స్థానిక కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థినీలకు రగ్గులు పంపిణీ చేశారు. విద్యార్థినీలు చలికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధవహించాలని కోరారు. 138 విద్యార్థినీలకు రగ్గులు పంపిణీ చేసి వారితో మాట్లాడారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని ప్రిన్సిపాల్ ని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందించి వైద్య సేవలు అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వారివెంట పాఠశాల ఉపాధ్యాయినీలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.