బోయినిపల్లి, మార్చి 23 (ఇలాకా): చొప్పదండి నియోజకవర్గం,బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన సురకాని మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి,రూ.50 వేలు నగదు ఆర్థికసాయం చేసి,మానవత్వాన్ని చాటుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ భవిష్యత్తులో మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు