ఉత్కంఠ పోరులో ముంబైదే విజయం

Spread the love
  • -అర్థసెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్
  • -ఎలీస్ పెర్రీ శ్రమ వృథా
  • -డబ్ల్యూపీఎల్ 2025


బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు వేదికగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రిచా ఘోష్ (28) పర్వాలేదనిపించింది. ముంబై బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ 3 వికెట్లు తీయగా.. షబ్నమ్, నట్ సివర్, హేలీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (38 బంతుల్లో 50) అర్థసెంచరీతో రాణించగా.. నట్ సివర్ బ్రంట్ (42), అమన్‌జోత్ (34 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో జార్జియా 3 వికెట్లు తీయగా.. కిమ్ గార్త్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా.. బెంగళూరు ఓటమి పాలైనప్పటికీ తొలి స్థానంలోనే కొనసాగుతుంది. నేడు జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడనుంది.