విడుదల చేయనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు సోమవారం జమకానున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్ వేదికగా జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని పీఎం కిసాన్ పథకం కింద 19వ విడుతగా రూ.22వేల కోట్లను విడుదల చేస్తారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో కలిపి ఏటా రూ.6వేలను జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించింది. పథకాన్ని ప్రారంభించి ఆరేళ్లయిన సందర్భంగా 19వ విడుత నిధుల కోసం ఫిబ్రవరి 24వ తేదీని ఎంచుకున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.