ప్రముఖ బైక్ తయారి కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రముఖమైన హిమాలయన్ మోడల్‌లలో మరో కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650(Royal Enfield Himalayan 650)ను తీసుకురాబోత్నుది. త్వరలో మార్కెట్‌లోకి రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 మోడల్‌ను ప్రస్తుత మోడల్‌కి మించిన పవర్, ఆధునిక సాంకేతికత, మరియు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధం కానుంది. భారతదేశం మాత్రమే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 మోడల్ అంతర్జాతీయ అడ్వెంచర్ బైక్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్థాయిని పెంచే అవకాశం నెలకొంది. ఈ బైక్ కేటీఎం 390 అడ్వెంచర్(KTM 390 Adventure), ట్రంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్(Triumph Scrambler 400X), బెనెల్లీ టీఆర్‌కే 502(Benelli TRK 502) , మోడల్ బైకులకు కాపిటీషన్‌గా నిలవనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 అనేది కంపెనీకి ఒక పెద్ద ముందడుగు. క్లాసిక్ హిమాలయన్ స్టుల్‌తో పాటు, ఆధునిక ఇంజిన్ పనితీరు మరియు ఫీచర్ల కలయిక, ఇది ఆఫ్-రోడ్ మరియు లాంగ్ రైడ్ ప్రేమికులకు సరైన బైక్‌గా నిలుస్తుంది.
పనితీరు
ఈ రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్‌లో 648సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ (ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జీటీ 650 నుంచి), సుమారు 47 బీహచ్‌పీ పవర్ మరియు 52 టర్క్ పవర్‌ను కలిగి ఉంటుంది.
ప్రత్యేకంగా పర్యటన చేసేవారికి మరియు ఆఫ్‌రోడ్ ప్రయానాలకు సౌకర్యవంతంగ ఉండే ఇంజన్, రిఫైన్‌డ్ గేర్ బాక్స్ కలిగి ఉండటం వలన దూర ప్రయాణాలకు ఈ రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్ మరింత అనుకులం.
అన్ని రకాల రహదారులలో, వాతవరణంలో బైక్ పై ప్రయాణం చేస్తున్నప్పుడు పట్టు తప్పకుండా ఉండేందుకు ఈ రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్‌ను పలు డిజైన్‌లు మార్పులు చేసి ప్రత్యేకంగా చాసిస్‌ను రూపోందించారు.
ఈ బైక్‌కు ముందు బాగంలో అత్యతధిక శక్తి గల యూఎస్‌డీ సస్పెన్షన్ మరియు వేనుక బాగంలో మోనోషాక్ టెక్నాలజీతో తయారు చేసిన సస్పెన్షన్ అమర్చారు.
బైక్ ముందు బాగంలో 19 ఇంచులు గల చక్రం, వెనుక బాగంలో 17 ఇంచుల స్పోక్‌వీల్స్ ఉండటంతో పాటు ముందు బాగంలో రెండు డిస్క్ బ్రేకులతో పాటు ఏబీఎస్ టెక్నాలజీతో మెదటి సారిగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్‌లో ఉపయోగించారు.
డిజైన్
రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్‌కు వారికున్న క్లాసిక్ డిజైన్‌ను కొనసాగిస్తు కొత్తగా నిర్మాణాత్మక విధానం(‘సెమీ-ఫేసింగ్ డిజైన్’)లో పలు మార్పులు చేస్తు చేసింది. ఈ బైక్‌కు పెద్ద ఫ్యూయల్ ట్యంక్ సామర్థ్యం కలిగి ఉండటం ద్వారా ఎక్కవ దూర ప్రయానాలకు అనుకులంగా ఉంటుంది. ఈ బైక్ సీట్‌ను స్లిట్ సీట్ డిజైన్, ప్రయాణానికి లగేజ్ తీసుకుపోవడానికి ప్య్రేకంగా టూరింగ్ మౌంట్స్, ఎత్తున ఎగ్జాస్ట్ ను అమర్చారు.
ఫీచర్లు
ఈ బైక్‌లో టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే, (బ్లూటూత్, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్), యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్స్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ప్రత్యేకతలను పొందుపరిచారు.
ధర
రాయల్‌ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్ ప్రస్తుతం ఇండియా మరియు యూరప్‌లో రోడ్ టెస్టింగ్ జరుగుతోంది
ఈ బైక్ సెప్టెంబర్ డిసెంబర్ 2025 మధ్యలో మార్కెట్‌లోకి రానుంది.
ఈ బైక్ ఎక్స్ షోరూం ధర సుమారు 4.0 నుంచి 4.9 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
వివరాలు
ఇంజిన్ 648సీసీ ప్యారలల్-ట్విన్, 47 బీహెచ్‌పీ, 52 ఎన్‌ఎం
చాసిస్ కొత్త ఫ్రేమ్, యూఎస్‌డీ ఫోర్క్, మోనో-షాక్, డ్యూయల్ డిస్క్
ఫీచర్లు టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ లైట్స్, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్
మార్కెట్‌లోకి సెప్టెంబర్ డిసెంబర్ 2025, ధర 4.0 నుంచి 4.9 లక్షలు
కాంపిటీషన్ కేటీఎం 390 అడ్వంచర్, ట్రంప్ స్క్రాంబ్లర్ 400ఎక్స్,
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 అనేది కంపెనీకి ఒక పెద్ద ముందడుగు. క్లాసిక్ హిమాలయన్ స్టుల్‌తో పాటు, ఆధునిక ఇంజిన్ పనితీరు మరియు ఫీచర్ల కలయిక, ఇది ఆఫ్-రోడ్ మరియు లాంగ్ రైడ్ ప్రేమికులకు సరైన బైక్‌గా నిలుస్తుంది.