పరిస్థితులను దగ్గరుండి పరిశీలిస్తున్న డిఫ్యూటి మంత్ర భట్టి విక్రమార్క,
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సొగంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడెందుకు ఆరుగురు ర్యాట్‌హోల్ మైనర్స్ ఢిల్లి నుంచి వచ్చారు. వీరు మొత్తం 12 మంది ఇదివరకే ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనలో 41 కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పరిస్థుతులు ఇక్కడ వేరుగా ఉన్నాయని ర్యాట్‌హోల్ మైనర్స్.
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీగ పేరుకుపోయిన బురద, ఉరూతున్న నీటీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎర్పడింది. హైకెపాసిటీ మోటర్లతో నిటి తొలగింపు. నీటి ఉధృతికి రెండు ముక్కలై ముందుకు కొట్టుకు వచ్చిన 1500 టన్నుల బరువుండే టన్నెల్ బోరింగ్ మిషిన్. సొరంగంలో 22 మీటర్ల మేర కూలిన భూమిపొరలు. ప్రమాద స్థలానికి చాలా దురంలోనే నిలిచిపోయిన రెస్క్యూటీం.
సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు దగ్గరుండీ పర్యవేక్షించుతున్నారు. సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలొద్దని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. సొరంగంలో వస్తున్న నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. టన్నెల్లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.