స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం

Spread the love

వేములవాడ రూరల్ బిజెపి అధ్యక్షులు పరమేష్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి విజయం పట్ల రూరల్ బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో సంబరాలు

వేములవాడ, మార్చి 4 (ఇలాకా): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వేములవాడ రూరల్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బురుగుపల్లి పరమేష్ అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించడంతో వేములవాడ తెలంగాణ చౌక్ లో రూరల్ మండల బిజెపి అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి ,స్వీట్లు పంపిణీ చేశారు,

ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని నమ్మి ఓటు వేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న ర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారం లోకి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు, ధన్యవాదాలు తెలిపారు.
.ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు పల్లికొండ నారాయణ, కార్యదర్శి గుంటి వంశీకృష్ణ, సోషల్ మీడియా ఇన్చార్జ్ పెద్దపల్లి మనోజ్, సీనియర్ నాయకులు గుండెల్లి వేణు, తోట శేఖర్ ,లింగంపల్లి కుంటయ్య, జంకే మధు, ఆవునూరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు