డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 6: బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, హైడ్రా నిర్మాణ అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం బ్యాంకర్ల సమావేశంలో భట్టి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని, వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని మరోసారి పునరుద్ఘాటించారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలని కోరారు.