బ్యాటింగ్‌లో బెంగళూరు విఫలం
మహిళల ప్రీమియర్ లీగ్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్-2025)లో గుజరాత్ జెయింట్స్‌కు ఓదార్పు విజయం దక్కింది. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కనికా అహుజా (33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాగ్వి బిస్త్ (22) పర్వాలేదనిపించింది. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వర్, డియాండ్రా దొతిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ అష్లే గార్డనర్ (58) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా.. ఫోబే లిచ్‌ఫీల్డ్ (30 నాటౌట్) ఆఖర్లో జట్టును గెలిపించింది. బెంగళూరు బౌలర్లలో రేణుకా, జార్జియా వర్హేహమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా..గుజరాత్ చివరి స్థానంలో కొనసాగుతోంది. నేడు జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.