ఇండియా టీమ్ ఘన విజయం

Spread the love
– వరల్డ్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్

మొయినాబాద్, ఫిబ్రవరి 27: మొయినాబాద్‌లోని అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌లో వరల్డ్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్ పోటీలు ఆసక్తిగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇండియా టీమ్ 12 యూకే టీమ్‌ను చిత్తు చేసింది. తొలి చక్కర్‌లో 8 రెండో చక్కర్‌లో 4 ఓడించింది. భారత్ తరఫున చైతన్యకుమార్ (4 గోల్స్), అర్సలన్ ఖాన్ (3 గోల్స్), సలీమ్ అజ్మీ (ఐదు గోల్స్) సాధించగా.. యూకే టీమ్ తరఫున లాదియా లెగ్గట్ (2 గోల్స్), లియో స్టువర్ట్ (ఒక గోల్), ఫెలిసిటీ కొబ్బొల్డ్ (ఒక గోల్) సాధించారు.

Scroll to Top