– వరల్డ్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్
మొయినాబాద్, ఫిబ్రవరి 27: మొయినాబాద్‌లోని అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్లో వరల్డ్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్ పోటీలు ఆసక్తిగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇండియా టీమ్ 12 యూకే టీమ్‌ను చిత్తు చేసింది. తొలి చక్కర్లో 8 రెండో చక్కర్లో 4 ఓడించింది. భారత్ తరఫున చైతన్యకుమార్ (4 గోల్స్), అర్సలన్ ఖాన్ (3 గోల్స్), సలీమ్ అజ్మీ (ఐదు గోల్స్) సాధించగా.. యూకే టీమ్ తరఫున లాదియా లెగ్గట్ (2 గోల్స్), లియో స్టువర్ట్ (ఒక గోల్), ఫెలిసిటీ కొబ్బొల్డ్ (ఒక గోల్) సాధించారు.